బాలునికి జయశంకర్ ఫౌండేషన్ చేయూత..

– రూ.10 వేలు అందజేసిన చైర్మన్ అయిలి మారుతి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బుట్టి శ్యామల రాజ్ కుమార్ యాదవ్ దంపతుల ఏడు నెలల కొడుకు హర్షిత్ కుమార్ గత నాలుగైదు నెలలుగా లివర్ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని పలు పత్రికల్లో కథనాలు, సోషల్ మీడియా  ద్వారా తెలుకున్న ప్రొపెసర్ జయశంకర్ పాండేషన్ చైర్మన్ అయిలి మారుతి మంగళవారం తన బృందంతో వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అధైర్య పడవద్దు అన్నివిధాలా పాండేషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.బాలున్నీ ఆర్థికంగా ఆదుకోవడానికి అన్ని వర్గాల దయనియులు ముందుకు రావాలని కోరారు.తమ వంతుగా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love