
– చిన్నవంగర గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
నవతెలంగాణ పెద్దవంగర
రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిన్నవంగర గ్రామానికి చెందిన యాసారపు కృష్ణ, యాసారపు అంజమ్మ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు నాయకులు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఆమె పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తోనే రాష్ట్రంలోని పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి వివరించాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మీకోసమే అమెరికా వదిలామని, అండగా తోడుంటామని చెప్పారు. పాలకుర్తి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. యశస్విని రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి, అసెంబ్లీకి పంపించాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు రాంపాక లావణ్య ఐలయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జలగం ప్రభాకర్, రాంపాక అశోక్, రాంపాక శేఖర్, జలగం రంజాన్, రాంపాక యాకయ్య, యాసారపు రజిత యాకయ్య, యాసారపు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.