పాలకుర్తి గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం కాయం: ఝాన్సీ రెడ్డి

నవతెలంగాణ- తొర్రూర్ రూరల్

పాలకుర్తి గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం ఖాయమని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు శనివారం మండలంలోని ఫతేపురం, పోలేపల్లి గ్రామాలలో  గడపగడపకు కాంగ్రెస్ పల్లె పల్లెకు ఝాన్సీ రెడ్డి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో బతుకమ్మలు బోనాలతో ఘన స్వాగతం పలికారు గ్రామంలో దుర్గామాత ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి సభలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 9 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో చేసింది ఏమీ లేదని అన్నారు రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలను చూసి ఓట్లు వేయాలని గ్రామ ప్రజలను కోరారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తుందని అన్నారు పాలకుర్తి నియోజకవర్గంలో  దయాకర్ రావును ఇంటికి పంపించాలని దమ్ముంటే కాంగ్రెస్ కార్యకర్తలపై ఎలాంటి కేసులు పెట్టకుండా ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ వర్ధన్నపేటలో మూడుసార్లు పాలకుర్తిలో మూడుసార్లు గెలిచిన దయాకర్ రావు చేసిన అభివృద్ధి ఏమి లేదని అన్నారు ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని అమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ప్రజలకు సేవ చేయడం కోసమే ఇక్కడికి వచ్చాను అని తాను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎమ్మెల్యే జీతం డబ్బులను కూడా విద్య ఆరోగ్యానికి ఖర్చు పెడతానని అన్నారు తనను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నెల పది రోజులు కష్టపడి సైనికునిల పని చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుంచు సంతోష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, గ్రామ సర్పంచ్ గూడెల్లి సోమ నరసమ్మ, ముత్తినేని సోమేశ్వరరావు తోరూర్ పట్టణ అధ్యక్షులు సోమరాజశేఖర్, నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
Spread the love