Sunday, June 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశం జాబ్‌ మేళా

నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశం జాబ్‌ మేళా

- Advertisement -

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
ఉపాధి కల్పించడంలో మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్
ముందుచూపు ప్రతిఒక్కరికీ ఆదర్శం : వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. నాగరాజు
నవతెలంగాణ – హైదరాబాద్

నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశం జాబ్‌ మేళా అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం వరంగల్ లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) కళాశాల ప్రాంగణంలో ప్రాంగణంలో ప్రభుత్వం, లక్ష్యం ఛారిటబుల్ సొసైటీ, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్, స్కిల్, లోన్‌ మేళా ఘన విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, వేలాది మంది యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుస్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నేటి కాలంలో ఏ ఉద్యోగానికైనా నైపుణ్యాలు (స్కిల్స్) అత్యంత అవసరమన్నారు. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్‌డీసీ), కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ) ద్వారా యువతకు శిక్షణ అందించేందుకు ఇటువంటి జాబ్ మేళాలు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. నాగరాజు మాట్లాడుతూ వేలాది మంది యువత ఒకే వేదికపై ఉద్యోగ అవకాశాల కోసం రావడం ఎంతో సంతోష కరమన్నారు.
ప్రభుత్వం, లక్ష్యం ఛారిటబుల్ సొసైటీ, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, కపిలవాయి దిలీప్ కుమార్ కలిసి యువత ఉపాధి, నైపుణ్యా భివృద్ధికి అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీ యమన్నారు. ప్రతి అభ్యర్థి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలకు హాజరై అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిభావంతులైన యువతను ప్రముఖ పరిశ్రమలతో అనుసంధానించే అద్భుత కార్యక్రమని అన్నారు. తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ విద్య ఉద్యోగాన్ని అందించినప్పుడే దానికి నిజమైన విలువ ఉంటుందని అన్నారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ మాట్లాడుతూ దేశానికి యువతే అతిపెద్ద సంపద అని, ఉపాధి ద్వారా ఆత్మవిశ్వాసం, గౌరవం పెరుగుతాయని, దేశ అభివృద్ధికి అది కీలకమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, చైర్మన్ కిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సభా అధ్యక్షులు వి. సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి అభ్యర్థి సానుకూల దృక్పథంతో ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లా మాజీ డీస్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రముఖ కంపెనీలను, వేలాది మంది ఉద్యోగార్ధులను ఒకే వేదికపైకి తీసుకురావడం గొప్ప కార్యక్రమమన్నారు. మ
ాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభుత్వం, లక్ష్యం ఛారిటబుల్ సొసైటీ సహకారంతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన ప్రతి కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమలు ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, కిట్స్ ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి, టీఆర్ఎల్డీ వరంగల్ జిల్లా అధ్యకులు రాంప్రసాద్ గడ్డం, కిట్స్ రిజిస్ట్రార్ కోమల్ రెడ్డి, కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అరవింద్, తెలంగాణ ఎన్ఎస్‌డీసీ ఎంగేజ్ మెంట్ అధికారి ప్రశాంత్, ప్రాంతీయ సంచాలకులు రవి, జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలోని టుమాకామ్ ప్రతినిధులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజీమ్ చంద్రశేఖర్ తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ మెగా జాబ్ మేళాలో 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనగా, 3,000 మందికి పైగా యువత నమోదు చేసుకున్నారు. వారిలో 1,000 మందికి పైగా అభ్యర్థులు వివిధ సంస్థల ద్వారా ఉద్యోగాల కోసం షార్ట్ లిస్ట్ చేయబడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -