Sunday, June 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవికలాంగులకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

మంత్రి సీతక్క వెల్లడి..
నైబర్ హుడ్ కేంద్రాలకు ఈ-ఆటోల పంపిణీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. హెలెన్ కెల్లెర్ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఆమె 14 నైబర్ హుడ్ కేంద్రాలకు ఈ-ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెలెన్ కెల్లర్ స్ఫూర్తితో వికలాంగులకు ప్రభుత్వం మరింత అండగా ఉంటుందని చెప్పారు. హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికే స్ఫూర్తి అని, చిన్న వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినా సంకల్పబలంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచా రని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వికలాంగులకు విద్య, ఉపాధి, పునరావాసం, జీవనోపాధి రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా మహిళల సాధికారత కోసం విశేషంగా పని చేస్తున్న సెర్ప్‌కు ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ బాధ్యతలను కూడా అప్పగించిందని తెలిపారు. వికలాంగ పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యతను మహిళా సంఘాల్లోని సభ్యులకు అప్పగించినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకుపైగా వికలాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం 82 వేల మందికి పైగా సభ్యులు ఈ సంఘాల్లో ఉన్నారని తెలిపారు. స్త్రీనిధి ద్వారా రూ.38.16 కోట్ల రుణాలు, గ్రామ మహిళా సంఘాల ద్వారా రూ.4.13 కోట్ల రుణాలు, రూ.11.62 కోట్ల పొదుపులు,2,248 మందికి జీవనోపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని సీతక్క తెలిపారు. ప్రస్తుతం 26 జిల్లాల్లో 74 నైబర్‌హుడ్ సెంటర్ల ద్వారా కమ్యూనిటీ మేనేజ్ డ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కార్యక్రమాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో విజయవం తంగా అమలు చేస్తు న్నామని చెప్పారు. మండల మహిళా సమా ఖ్యల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైబర్ హుడ్ కేంద్రాల్లో దాదాపు మూడు వేల మంది వికలాంగులైన పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ప్రత్యేక విద్య, కౌన్సెలింగ్, నైపుణ్యా భివృద్ధి వంటి సేవలు అందుతు న్నాయని వివరించారు. తల్లిదం డ్రులకు శిక్షణ, కౌన్సెలింగ్‌తో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ-ఆటోలతో ఇప్పటివరకు రవాణా సమస్యల వల్ల పిల్లలను కేంద్రాలకు తీసుకురా లేకపోయిన కుటుంబాలకు ఇకపై ఇంటి వద్ద నుంచే ఉచిత రవాణా సౌకర్యం అందుబా టులోకి వస్తుంద న్నారు. ముఖ్యంగా ఆటిజం, మేధోవైకల్యం తదితర వైకల్యాలు ఉన్న పిల్లలు క్రమం తప్ప కుండా థెరపీ, శిక్షణ పొందేం దుకు ఇది ఎంతో ఉపయోగప డుతుందని చెప్పారు. హెలెన్ కెల్లర్ లాగే వికలాం గులందరిలో అపా రమైన ప్రతిభ దాగి ఉంటుం దని అన్నారు. పుట్టుకతో వచ్చిన వైకల్యాలను కూడా తల్లిదం డ్రుల ప్రేమ, ప్రోత్సాహం, సరైన శిక్షణతో ఎంతోవరకు అధిగమించవచ్చని చెప్పారు. అలాంటి పిల్లల పట్ల కుటుంబ సభ్యులు నిరాశ చెందకుండా మరింత శ్రద్ధ చూపాలని సూచిం చారు. ముఖ్యమంత్రి సహ కారంతో వికలాం గుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి త్రిచక్ర వాహనాలు, జీవనో పాధి అవకాశాలు, స్వయం సహాయక సంఘా లు, నైబర్‌హుడ్ సెంటర్లు వంటి అనేక కార్యక్ర మాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ కార్య క్రమానికి సహకరించిన ఇండియన్ ఆయిల్ కార్పొరే షన్‌కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలి పారు. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, సమా జం కలిసి పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధిం చవచ్చని ఆమె అన్నారు. వికలాం గులందరికి వారి ఇంటి సమీపంలోనే సేవలం దేలా నైబర్‌హుడ్ సెంటర్లను మరింత బలోపే తం చేస్తామని, అవసరమైన చోట కొత్త కేంద్రా లు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. అనంతరం పలువురు తల్లులు మాట్లాడు తూ బావో ద్వాగానికి లోనయ్యారు. నైబర్ హుడ్ కేంద్రా లు తమ పిల్లలకు కొత్త జీవితాన్ని ఇచ్చాయని తెలిపారు. రఘునాథ్ పల్లి మండలానికి చెందిన మమత, రాజాపూర్ రాజాపూర్‌కు చెందిన శిరీషలు నైబర్ హుడ్ కేంద్రాలు తమ పిల్లలకు అందిస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, వికలాంగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -