జో బిడెన్ భారీ విజయం..

నవతెలంగాణ – అమెరికా: అమెరికా అధ్యక్ష ప్రధాన ఎన్నికలు 2024 నుంచి ప్రారంభమై నవంబర్ 5 వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సౌత్ కరోలినా ప్రైమరీలో జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ జో బిడెన్ భారీ తేడాతో విజయం సాధించినట్లు తెలుస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుండి అధ్యక్ష అభ్యర్థిగా ఉండగా, పోటస్ జో బిడెన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అధ్యక్షుడిగా రెండోసారి గెలవాలని ఇరువురు నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా.. డెమొక్రాట్‌ల కోసం వారి అధ్యక్ష నామినేటింగ్ క్యాలెండర్‌లో పేర్కొన్న మొదటి పోటీలో, జో బిడెన్ సౌత్ కరోలినా ప్రైమరీని భారీ తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో బిడెన్ తనతో నల్లజాతి పౌరులు ఉన్నారని నిరూపించుకున్నాడు. ఈ విజయంతో బిడెన్ వర్గంలో మరోసారి ఉత్సాహం నెలకొంది.

Spread the love