బీఆర్‌ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి చేరికలు

నవతెలంగాణ-ఖమ్మం
సింగరేణి మండలంలోని బిఆర్‌ఎస్‌కు ఇద్దరు ఎంపీటీసీలు, ఎల్‌ఏసిఎస్‌ ఛైర్మన్‌, రైతుబంధు సమన్వయ కమిటీ ఛైర్మన్‌లు సోమవారం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌, టీపిసిసి మాజీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావుల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పాత కమలాపురం, దుబ్బతండ, గంగారాం తండా, విశ్వనాథపల్లి, ఎర్రబోడు, గేట్‌ రేలకాయలపల్లి, సర్పంచ్‌లు గుగులోత్‌ పద్మ, గుగులోత్‌ భద్రి, భూక్యా సుజాత, జ్యోతి, కుర్సం సత్యనారాయణ, భానోత్‌ సక్సీరాం, సింగరేణి (కారేపల్లి) ఎల్‌ఏసిఎస్‌ ఛైర్మన్‌ దుగ్గినేని శ్రీనివాసరావు, గాదెపాడు, సీతారాంపురం ఎంపీటీసీలు భూక్యా సోని, భానోత్‌ రమేష్‌, సింగరేణి మాజీ ఎంపీపీ భానోత్‌ పద్మావతి, సింగరేణి రైతుబందు కన్వీనర్‌ ఈసాల నాగేశ్వరరావులు కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ పిసిసి వడ్డే నారాయణరావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, జిల్లా యువజన కాంగ్రెస్‌ అద్యక్షులు యడ్లపల్లి సంతోష్‌, తోటకూరి రాంబాబు పాల్గొన్నారు.
ఐదుగురు బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు కాంగ్రెస్‌లోకి
ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలంలోని కోయగూడెం, గొల్లపల్లి, కొప్పురాయి, శంబుని గూడెం, తడికలపూడి గ్రామాలకు చెందిన ఐదుగురు ఎంపీటీసీలు జాల సంధ్య, చింతా శాంత కుమారి, బట్టు శివ, బానోతు మౌనిక, వాంకుడోతు ధనలక్ష్మి బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. సోమవారం ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలోకి చేరిన వారందరికీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని ఈ సందర్భంగా పొంగులేటి హామీ ఇచ్చారు.
300 కుటుంబాలు కాంగ్రెస్‌ లోకికొణిజర్ల మండలంలోని అమ్మపాలెం, రాజ్యతండా గ్రామాలకు చెందిన సుమారు 300 కుటుంబాలు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాయి. వైరా నియోజకవర్గ ఆత్మకమిటీ చైర్మన్‌ కోసూరి శ్రీనివాస్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, దూదేకుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు షేక్‌ గాలిబ్‌ పాషా, రాజ్యతండా అయ్యప్ప ట్రస్ట్‌ చైర్మన్‌ సిద్ధు నాయక్‌, తేజావత్‌ కోటి, కోసూరి నాగ సైదులు ఆధ్వర్యంలో పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఈ చేరారు.

Spread the love