బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలించి. శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో చిన్న నిజాంపేట నుంచి 30 మంది యువత, రామేశ్వరం పల్లికి చెందిన 10 మంది, పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన 15 మంది బీఆర్ఎస్ నాయకులు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే రఘునందరావ్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పెద్ద గుండవెల్లి ఎంపిటిసి పరికి రవి గౌడ్, పార్టీ నాయకులు దండు రాజు, మల్లారెడ్డి, మహేష్, శివ రాజన్ తదితరులున్నారు
Spread the love