నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె

నవతెలంగాణ – హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీ మినహా ఓపీ, సర్జరీలు, వార్డ్ సేవలను నిలిపివేస్తున్నట్లు జూడా అసోసియేషన్ తెలిపింది. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైఫండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం వంటి డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తామని ప్రకటించింది.

Spread the love