పేదల, మహిళల అభివృద్ధికై జీవితాంతం కృషిచేసిన జూపల్లి రాధ..

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గ్రామీణ పేదలకు విద్య, వైద్యం ఉపాధి కల్పించాలని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని  ఎర్రజెండా సీపీఐ(ఎం) నాయకత్వంలో జరిగిన అనేక పోరాటాల్లో ముందుండి పనిచేసి, ఆదర్శవంతమైన నాయకురాలు కామ్రేడ్ జూపల్లి రాధ అని, వారి ఆశయ సాధనలో ప్రజా ఉద్యమాలను ఉదృతంగా కొనసాగిద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో శుక్రవారం రాత్రి సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గునుగుంట్ల శ్రీనివాస్ అద్యక్షతన కామ్రేడ్ జూపల్లి రాధా  ఐదవ  వర్ధంతి కార్యక్రమాన్ని వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ.. కామ్రేడు రాధ గారు సామాన్య కుటుంబంలో పుట్టి సీపీఐ(ఎం) నాయకత్వంలో అనాజిపురం గ్రామంలో జరిగిన అనేక కూలీ, భూమి పోరాటాలలో ముందుండి పని చేశాదని అన్నారు. గ్రామంలో విద్యా కమిటీ చైర్మన్ గా గెలిచి అందరికీ ఉచిత విద్య అందాలని, నాణ్యమైన విద్యను గ్రామీణ పేద విద్యార్థులకు అందించాలని, హై స్కూల్ స్థాయి వరకు గ్రామంలో విత్య అందించాలని కోరుతూ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు.
మహిళలు ఇంటికే పరిమితం కాకుండా మహిళల సమస్యల పరిష్కారం కోసం పోరాటాల్లో ముందుండాలని మహిళలను చైతన్యపరిచిన దాంట్లో రాధ పాత్ర గొప్పదనారు. గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ ప్రజా ప్రతినిధులను గెలిపించే దాంట్లో ముందుండి పనిచేసి గెలిచిన తర్వాత గ్రామ సమగ్రాభివృద్ధికి కోసం చనిపోయే వరకు పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ల సంఘం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన శ్రీనివాస్,  గ్రామ మాజీ సర్పంచ్ బొల్లెపల్లి కుమార్, నాయకులు ఎండి జహంగీర్. అబ్దుల్లాపురం వెంకటేష్, ఏదునూరి వెంకటేష్,మాజీ పాల సంఘం చైర్మన్ లు కడారి క్రిష్ణ, గంగనబోయిన పాండు, బాలనరసింహా,మాజీ వార్డ్ మెంబర్ పిట్టల వెంకటేష్,ఏదునూరి జమ్మయ్య,శ్రీనివాస్,  అఫ్జల్, నారగోని బాలరాజు ,ఆకుల భిక్షపతి, గంగదారి రాజు, గంగనబోయిన రాజు, బోల్లెపల్లి కిషన్, అజ్జు, మైలారం శివ, బొల్లెపల్లి ప్రవీణ్ ,మడిపడగ వెంకటేష్ ,బాలయ్య,కోట ఉమేష్, ఎదునూరి సురేష్,గణేష్, పన్నాల రేణుక, మడిపడగ రాణి, శంకర్,రామచందర్,మహేందర్, వెంకటస్వామి,సత్యనారాయణ, పొషాలు, కుటుంబ సభ్యులు భర్త జూపల్లి సత్తయ్య, కుమారులు -కోడలు వెంకటేష్ పూజ నవీన్ నవీ న్ లు పాల్గొన్నారు.
Spread the love