Tuesday, June 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘కమలమ్మ’ అందరికీ ఆదర్శం

‘కమలమ్మ’ అందరికీ ఆదర్శం

- Advertisement -

సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-మహబూబాబాద్

డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ తల్లి మేకపోతుల కమలమ్మ భౌతిక కాయంపై ఖమ్మం మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం సోమవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పేదల అభ్యున్నతికి ఆదర్శమే కాకుండా సమసమాజ మార్పు కొరకు తన కుటుంబం నుంచి కుమారుడిని, కూతురిని అందించిన ఓ గొప్ప తల్లి అని కొనియాడారు. నివాళులర్పించిన వారిలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, టాడీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పల్లె రవికుమార్, హైదరాబాద్ సుప్రజ హాస్పటల్ ఎండీ శిగ విజయ్ కుమార్, సీపీఐ(ఎం) జిల్లా కారదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న, జి.రాజన్న, అకుల రాజు, కందునూరి శ్రీనివాస్, గోపా నాయకులు సిలివేరు సమ్మిగౌడ్, నాయకులు చెరెడ్డి బిక్షరెడ్డి, గీత సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌని వెంకన్న, ఎమగానే వెంకన్న ఉన్నారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -