Tuesday, June 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సంక్షోభం

ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సంక్షోభం

- Advertisement -


​ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-కాజీపేట

‘ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇంటింటా సంక్షోభం తెచ్చింది’ అని బీఆ‌ర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ‌పరిధిలోని సత్యసాయి కన్వెన్షన్‌లో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆధ్వర్యంలో సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ సర్ ప్రక్రియ, డిజిటల్ మెంబర్‌షిప్, సోషల్ మీడియాపై శిక్షణా తరగతులు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి రైతులకు మరణ శాసనం రాసిండని, ఒకప్పుడు కేంద్రం చెప్తే వినడానికి మోడీకి బ్రోకరా అన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే పని చేస్తున్నాడని ఆరోపించారు. అందుకే మోడీ చెప్పినంతనే పంట కొంటాం అంటున్నడు అని.. ఇలా ఐతే వచ్చే సీజన్ నుంచి రైతన్నల పంటలు కొనే నాథుడే ఉండడని అన్నారు. గడిచిన రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మంచి పని చేయలేదని అన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో సంక్షేమం, అభి‌వృద్ధి జరిగిందని తెలిపారు. వచ్చే ఐదేండ్లు కార్యకర్తల అభి వృద్ధి లక్ష్యంగా పనిచేసే బాధ్యత తానే తీసుకుంటానని తెలిపారు. అరూరి రమేష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా తీసుకొని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, టి. రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు సతీష్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, సుధీర్ బాబు, ఏనుగుల రాకేష్‌రెడ్డి, లలిత యాదవ్, వర్ధన్నపేట నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పా‌ల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -