Tuesday, June 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాబోయే కాలం ఎర్రజెండాదే

రాబోయే కాలం ఎర్రజెండాదే

- Advertisement -

జెన్నీ మార్క్స్, సుందరయ్య స్ఫూర్తితో ముందుకు నడుద్దాం : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
మహబూబ్‌‌నగర్‌ నుంచి నవతెలంగాణ ప్రతినిధి

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం గా పోరాటాలు తీవ్రమవుతున్నాయనీ, రాబోయే కాలం ఎర్రజెండాదేనని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ చెప్పారు. నూతన ధనిక వర్గానికి వ్యతిరేకంగా గ్రామాలను పోరాట కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులంతా విప్లవతత్వాన్ని పుణికి పుచ్చుకోవా లని సూచించారు. జెన్నీ మార్క్స్, పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశంలో కమ్యూనిస్టులు ఎక్కడ అని మాట్లాడుతున్న పార్టీలన్నీ పాతాళానికి తొక్కబడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలి పోరాటాలు మరింత పెరగాలని ఆకాంక్షించారు. కూలి, భూమి, సామాజిక పోరాటాలు చేయకుండా సంఘం పెరగదని స్పష్టం చేశారు.

​ ప్రజా పునాదిని పెంచుకోవాలి : జాన్ వెస్లీ
ప్రజల్లోకి వెళ్లి స్థానిక సమస్యలపై పోరాటాలు చేయటం ద్వారా ప్రజా పునాదిని పెంచుకోవాలని వ్యవ సాయ కార్మిక సంఘం శ్రేణులకు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్ వెస్లీ సూచించారు. విద్యా వైద్య రంగాలు కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్లిపోయాయనీ, సామాన్య ప్రజానీ కానికి విద్య, వైద్యం అందని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలను, వైద్యశాలలను బలోపేతం చేసేందుకు పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం జరిగే పోరాటంలో వ్యవసాయ కార్మిక సంఘం కీలక భూమిక పోషించాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో సామాజిక అణచివేత, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సూచించారు.
​​ అసమానతలు లేని సమాజం రావాలి : ఆర్ వెంకట్రాములు
అసమానతలు లేని సమాజం రావాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్గ పోరాటాలను బలోపేతం చేయాలనీ, పోరాటాల్లో ఎక్కడ కూడా రాజీపడవద్దని శ్రేణులకు సూచించారు. ఆగస్టు 10 జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను వర్గ పోరాటాన్ని కి అనుకూలంగా వాడుకోవాలి గానీ దాని ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -