Tuesday, June 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకళాకారులను గౌరవించి సంస్కృతిని కాపాడాలి

కళాకారులను గౌరవించి సంస్కృతిని కాపాడాలి

- Advertisement -


ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
జాతీయ నృత్యోత్సవాలు ఆరంభం
నవతెలంగాణ-కల్చరల్

కళాకారులను గౌరవించుకోవడం అంటే సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం.. ప్రోత్సాహించడమే అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ నృత్యోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. అర్ధనారీశ్వరం పేరిట నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల కళాకారులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. పర్యాటక ప్రదేశాల్లో కళాకారులకు వసతి రాయితీ వంటి సౌకర్యాలు అవసరమన్నారు. సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఇలాంటి నృత్య నాటకోత్సవాలు జిల్లాల్లో కూడా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ కళాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి ఈ ఉత్సవాలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సభాధ్యక్షత వహించిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల మాట్లాడుతూ.. వంద రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత వైభవోపేతంగా జాతీయ స్థాయి నృత్యోత్సవాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.


కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కార విజేతలకు ఘన సత్కారాలు
కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇటీవల ప్రకటించిన తెలంగాణ అవార్డు విజేతలు వోలేటి రంగమణి (వివిధ నృత్య కళల సేవ), రాజేశ్వరి సాయినాథ్ (భరతనాట్యం), దురిశెట్టి రామయ్య (జానపదం – కడ్డీ), డి. శ్రీనివాస్ (సంగీతం – వీణ), ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార విజేతలు సాత్విక పెన్నా (ఆంధ్రనాట్యం), పేరి త్యాగరాజు (సంగీతం – వయోలిన్), అజయ్ శ్రీనివాస్ చక్రవర్తి (కూచిపూడి)ని ఘనంగా సన్మానించారు. అనంతరం హైదరాబాద్ యువ కళాకారులు సురేంద్రనాథ్ డాక్టర్ బిజినా దంపతులు “ద్వయం” కూచిపూడి నృత్యంతో అర్ధనారీశ్వరానికి సంపూర్ణత చేకూర్చారు. న్యూఢిల్లీ కళాకారులు లాయర్ వసీమ్ రాజా కూచిపూడి శైలిలో ప్రదర్శించిన “సమర్పణం” ఆకట్టుకుంది. చివరగా హైదరాబాద్ కళాకారులు ఆయన మనోజ్ఞ బాలరాజు బృందం “అధర్వ” ప్రదర్శించి ఆకట్టుకున్నారు ప్రకృతి ప్రత్యేకతను, స్త్రీ పురుష సమానత్వాన్ని చాటి చెబుతూ అర్ధనారీశ్వరం ముగ్ధులను చేసింది మూడ్రోజులు ఆయా ప్రదర్శనల గురించి విద్యార్థులకు సమీక్ష వ్యాసరచన పోటీలు నిర్వహించి తగిన బహుమతులు ఇచ్చి ప్రోత్సహించనున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -