Monday, August 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ ల్యాబ్ టెక్నీషియన్స్ 
సమస్యలు పరిష్కరించాలి

ప్రభుత్వ ల్యాబ్ టెక్నీషియన్స్ 
సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -


తెలంగాణ యునైటెడ్ మెడికల్ 
అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియయన్ల (గ్రేడ్ -2) సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2026 బ్యాచ్ ల్యాబ్ టెక్నీషియన్ల అభినందన సభ యూనియన్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌‌డీ ఫసియుద్దీన్‌ అధ్యక్షతన నిర్వహించారు. యాదా నాయక్ మాట్లాడుతూ…ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు రోగనిర్ధారణ చేసి చికిత్సలు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరిగాదన్నారు. సర్వీస్ మొత్తంలో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోకుండా రిటైర్ కావడం అత్యంత బాధాకరమనీ, ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రమోషన్ల ఛానల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలనీ, సీపీఎస్‌ను రద్దుచేసి ఓపిఎస్ ను అమలుపరచాలని కోరారు. ల్యాబ్ టెక్నీషియన్ల రాష్ట్ర నాయకులు మామిడి ఆదిత్య పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు, ల్యాబ్ టెక్నీ షియన్స్ పేరును ల్యాబ్ ఆఫీసర్లుగా మార్చాలనీ, ల్యాబ్ టెక్నీషియన్లకు రిస్క్ అలవెన్స్ పెంచాలని కోరారు. పని ప్రదేశంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనీ, పే స్కేల్స్ లో వ్యత్యా సాన్ని సవరించాలని కోరారు. అనంతరం ఇటీవల నియమితులైన ల్యాబ్‌ ‌టెక్నీషియన్లను సన్మానించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి విభూలక్ష్మి, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు వి విజయ వర్ధన్ రాజు, జే సుధాకర్, కిరణ్మయి, రాష్ట్ర నాయకులు సంగమేశ్వర్, భాస్కర్, శ్రీనివాస్, పురేందర్, బీచుపల్లి, సంధ్య, కృపాకర్, శ్రీనాథ్,రాజు,రేవతి మోహన్,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -