Monday, August 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం​సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కుమారుడి అంత్యక్రియలకు జాన్‌‌వెస్లీ

​సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కుమారుడి అంత్యక్రియలకు జాన్‌‌వెస్లీ

- Advertisement -


నవతెలంగాణ-గోదావరిఖని
సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై.యాకయ్య కుమారుడు సమరకేతన్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య పాల్గొన్నారు. సమర కేతన్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం యాకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు జి.రాములు, స్కైలాబ్ బాబు, తుమ్మల రాజారెడ్డి, ఎర్రవల్లి ముత్యంరావు, గీట్ల ముకుంద రెడ్డి, జిల్లా నాయకులు ఎ.మహేశ్వరి, వి.కుమారస్వామి, జి.జ్యోతి, ఎన్.బిక్షపతి, ఎం.రామాచారి, మెండే శ్రీనివాస్, శైలజ, నాగలక్ష్మి, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -