
భీంగల్ పట్టణంలోని అన్ని వార్డులలో పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందికి చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సూచించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున ముందుగానే మురికి నీటి ప్రాంతాలను గుర్తించి తొలగించాలన్నారు. అనంతరం అట్టి ప్రదేశాలలో బ్లీచింగ్ పౌడర్ ని వేయించాలన్నారు. ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కౌన్సిల్ ఆధ్వర్యంలో పలు అంశాలను ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గ రసాన్ని ప్రారంభించారు.ఈ సమావేశంలో కమీషనర్ రామకృష్ణ , వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్. కౌన్సిలర్ సతీష్ గౌడ్.బోదిరె నర్యయ్య.ధరావత్ లింగయ్య. మల్లెల రాజశ్రీ.మూతలత. షమీం బేగం. కో ఆప్షన్ సభ్యులు. అజ్మతుల్లా. పర్స నవీన్. వివిధ శాఖల అధికారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.