లైన్స్ క్లబ్ సేవలు మరువలేనివి: కటకం ప్రశాంత్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలం ఆరెగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష పాడ్స్ మరియు పెన్స్ లయన్స్ క్లబ్ చౌటుప్పల్ సేవ అధ్యక్షులు కటకం ప్రశాంత్ చేతుల మీదుగా శనివారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కటకం ప్రశాంత్ మాట్లాడుతూ ఈనాటి విద్యార్థులే రేపటి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని బాగా చదువుకొని పేద ప్రజలకు చేయూతనివ్వాలని కోరారు.అదేవిధంగా గ్రామానికి చదువుకున్న స్కూల్ కి మంచి పేరు తేవాలని జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవాలని అన్నారు.మంచిగా చదివి ఆదర్శంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ నల్లగొండ జిల్లా మెంబర్ గోశిక కరుణాకర్ లైన్స్ క్లబ్ సీనియర్ మెంబర్ ట్రస్ట్ మెంబర్ లయన్ దాచేపల్లి శ్రీను హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది
Spread the love