రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన మహనీయుడు కేసీఆర్..

నవతెలంగాణ-తొగుట
రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి,తెలం గాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధి ప్రదాత అని ఎల్లారెడ్డిపేట సర్పంచ్ సిరి నేని గోవర్ధన్ రెడ్డి అన్నారు.ఆదివా రం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరా టం చేశారన్నారు.2009 నవంబర్ 29 చావు నోట్లో తల పెట్టి ఆమరణ నిరాహారదీక్ష చెప్పట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఏకం చేసి తెలంగాణ ప్రకటన చేసే విదంగా దీక్ష చేశారన్నారు.రాష్ట్రం ఆవిర్భావం అనంతరం అభివృద్దే లక్షంగా నిరం తరం కృషిచేశారని పేర్కొన్నారు.నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని దృఢ సంకల్పంతో అన్ని వర్గాల సంక్షేమం ద్యేయంగా పాలన కొన సాగించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎడారిని తలపించేలా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాజెక్టుల ను నిర్మాణం చేస్తూ అన్ని జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందే విదంగా కృషి చేశారని హర్షం వ్యక్తం చేశారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో తాగునీటి కోసం మహిళలు కాళీ బిందెలతో యెన్నో సార్లు రోడ్లపై ధర్నాలు చేసిన సందర్భలు ఉన్నాయని చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నేడుతాగు నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్విరా మంగా కృషి చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఓటమి పాలవడం బాధాకరమన్నారు.
Spread the love