నగరంలో యువతి కిడ్నాప్ కలకలం..

నవతెలంగాణ – కంటేశ్వర్
ఓ యువతిని కొందరు యువకులు కిడ్నాప్ చేసి, ఆపై వేధింపులకు పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఆరవ టౌన్ పరిధికి చెందిన ఓ యువతీ ఈనెల 24వ తేదీన తెలిసిన యువకుడితో కలిసి బైక్ పై ఖిల్లా రోడ్డు గుండా వెళ్తోంది. అయితే ఖిల్లా రోడ్డు ప్రాంతంలో కొందరు యువకులు బుధవారం సాయంత్రం బైకును అడ్డుకున్నారు. ఆపై బైక్పై ఉన్న యువకుడిని బెదిరించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం సదరు యువతిని ఇద్దరు యువకులు బైక్ లపై బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేసి, ఆపై వేధింపులకు పాల్పడ్డారు. నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి సదరు యువతీ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. అనంతరం బోధన్ రోడ్డులో యువతీని వదిలేశారు. దీంతో సదరు యువతి గురువారం ఉదయం వన్ టౌన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు ఖిల్లా రోడ్డు ప్రాంతంలో గల సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా హైమద్ పుర కాలనీకి చెందిన ఇంతియాజ్, కంటేశ్వర్ కు చెందిన మతిన్ లుగా గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. వేరు నుంచి రెండు బైక్ లను స్వాధీనపరచుకున్నట్లు ఎస్ హెచ్ ఓ విజయ బాబు తెలిపారు. పోలీసులు కూడా ఏ రోజు ఏ క్రైమ్ జరిగిందో అనే కొన్ని విషయాలను దాస్తున్నట్లు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు ఇచ్చిన సమాచారం మేరకు సంబంధిత పోలీసులు కూడా పత్రిక విలేకరులకు సమాచారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంట్లో దాపరికం చేయడం వల్ల కేసు తప్పు దోవ పట్టె అవకాశం ఉంది. పోలీసులు సైతం కేసులను డాబరిగం చేయడం వలన నిందితులు రోడ్లపై తిరుగుతున్నారు అని ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తతున్నాయి ఇప్పటికైనా పోలీసులు ఏరోజు జరిగిన సంఘటన ఆరోజు సంబంధిత ఉన్న అధికారులతో పటు పత్రిక ప్రకటన ద్వారా చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉంటారని కోరుతున్నారు.

Spread the love