సాంకేతిక పరిజ్ఞానంలో కేటీఆర్ తెలంగాణను అగ్రగామిగా నిలిపారు: రవీందర్ గౌడ్

నవతెలంగాణ- రామారెడ్డి
సాంకేతిక పరిజ్ఞానంలో తెలంగాణ రాష్ట్రాన్ని మంత్రి కేటీఆర్ దేశంలో అగ్రగామిగా నిలిపారని సోమవారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్ అన్నారు. మండలంలోని రెడ్డి పెట్, రామారెడ్డి లో కేటీఆర్ జన్మదిన వేడుకలను ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తో కలిసి నిర్వహించారు. రెడ్డి పేటలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అరటి పండ్లు, జాగిరావను అందజేశారు. మండల కేంద్రంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అనేక పురస్కారాలు అందుకొని, తెలంగాణ అన్ని రకాల అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవీందర్ రావు, రైతుబంధు అధ్యక్షులు నారాయణరెడ్డి, జిల్లా రైతుబంధు డైరెక్టర్ కాసర్ల రాజేందర్, ఎంపీటీసీల పురం అధ్యక్షులు రాజా గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రామ్ రెడ్డి, సర్పంచులు దండ బోయిన సంజీవ్, గంగారం, రాజా నర్సు, రవిందర్రెడ్డి, ప్రజా ప్రతినిధులు, పోతు నూరి ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, శర్మ నాయక్, పాల మల్లేష్, రామడుగు అనుమండ్లు, రాజు నాయక్, జిల్లా బాలయ్య, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love