‘కొడాలి’కి తప్పిన పెను ప్రమాదం

నవతెలంగాణ- అమరావతి: విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చిన కొడాలి నానికి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం నాని కుటుంబసమేతంగా వచ్చారు. దర్శనం తర్వాత తిరిగి వెళ్లేటప్పుడు వినాయకుడి గుడి దగ్గర సిమెంట్ బారికేడ్‌ను నాని కారు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన కారులోనే నానితోపాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. చిన్నప్రమాదం కావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం అనంతరం అదే కారులోనే గుడికి వెళ్లినట్టు తెలుస్తోంది.
Spread the love