Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల హక్కుల సాధనకై పనిచేసిన కోలా శంకర్ 

విద్యార్థుల హక్కుల సాధనకై పనిచేసిన కోలా శంకర్ 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను
విద్యార్థుల హక్కుల సాధన కొరకు పిడిఎస్యు రాష్ట్ర  నాయకులు  కోల శంకర్ పనిచేశారని, పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పంగ రవి అన్నారు. ఆలేర్ పట్టణంలో గురువారం   సిపిఐ(ఎంఎల్)ఎన్డీఆర్ కార్యాలయంలో పిడిఎస్యు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు,ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శి  కోలాశంకర్ 36వ వర్ధంతి  సబ  పీడీఎస్యు ఉపాధ్యక్షుడు టీ శ్రవణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు పంగ అంజయ్య శంకర్ చిత్రపటానికి పూలమాలు వేసి,రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పంగ రవి మాట్లాడుతూ శాస్త్రీయ విద్యాసాధన కోసం,విద్యార్థుల హక్కుల కోసం,విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడారన్నారు. శంకర్ భౌతికంగా దూరమై 36 సంవత్సరాలు గడిచిన ఆయన పోరాటం మార్గాన్ని రూపుమాపలేకపోయారని,శాస్త్రీయ విద్యాసాధన లక్ష్యంగా పనిచేసిన కోలాశంకర్ మార్గంలో విద్యార్థులు నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  పి నాగరాజు,పి సునీల్,పి సాయిలు,బి మల్లయ్య, ఏ రమేష్ తదితరులు  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -