కర్ణాటకలో కాంట్రాక్టు కోసమే కాంగ్రెసులో చేరుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

– నాకు అభివృద్ధి కోసం పదవి అవసరమైతే.. కోమటిరెడ్డి కేమో కాంట్రాక్టర్ల కోసం పదవి కావాలి..
– 5 వందల 70 కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన నాకు మరోసారి అవకాశం ఇవ్వండి…
– కాంట్రాక్టర్ల కోసం పార్టీలు మారే వారిని గెలిపించుకుంటే మళ్లీ దోస పడతారు…
– బీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..
నవతెలంగాణ- మునుగోడు:
మునుగోడు నియోజకవర్గ ప్రజలను మాయ మాటలు చెప్పి డబ్బుల సంచులతో వచ్చి సొంత డబ్బులతో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్  18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం బీజేపీకి మునుగోడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆరు నెలలు గడవకముందే కర్ణాటకలోని కాంట్రాక్టు కోసం కాంగ్రెస్ చేరుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ మోసం చేసేందుకు వస్తే మునుగోడు నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు గురువారం మునుగోడు మండలంలోని చౌటుప్పల్ రోడ్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం అనగానే కాళ్లు చేతులు వంకర్లు పోయి ఫ్లోరోసిస్ తో బాధపడుతున్న ఈ ప్రాంత ప్రజల సమస్యలు పోవాలంటే తెలంగాణ రాష్ట్రం వస్తేనే సాధ్యమవుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు నియోజకవర్గం లోనే మొట్టమొదటిగా మిషన్ భగీరథ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించి రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని అందించి ఫ్లోరోసిస్ ను తరిమికొట్టిన ఘనత కేసిఆర్ దే అని అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు నాకు పెదవి అవసరమైతే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేమో తమ సొంత ప్రయోజనాల కోసం , కాంట్రాక్టర్ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు పదవి కావాలి అని  అన్నారు. రాజగోపాల్ రెడ్డి మాయమాటలు నమ్మి మునుగోడు ప్రజలు మోసపోయినందుకు నాలుగేళ్లు నియోజవర్గ ప్రజలకు గోస తప్పలేదని అన్నారు . అదృష్టం గా మునుగోడు ప్రజలకు ఉప ఎన్నిక వచ్చినందుకు ఎమ్మెల్యే గా గెలిపించిన వెంటనే మునుగోడు నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు  కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి సహకారంతో 5 వందల 70 కోట్ల నిధులు తెచ్చి ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా  గెలిచిన నుండి ఇంటి వద్ద ఉండకుండా అభివృద్ధి కోసం అడుగులు వేశానని అన్నారు. నా జన్మంతా మునుగోడు అభివృద్ధి కోసమే ధారా పోస్తానని  అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టుల అన్నింటిని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి ఆ నీటితో ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడగడమే తన  కోరిక అని అందుకు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను ప్రాధేయపడ్డాడు.  2018 ఎన్నికల్లో మాయ మాటలతో  ప్రజలు మోసపోయి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే ఏనాడు ఈ ప్రాంత ప్రజల కోసం అందుబాటులో ఉండలేదని, కాంట్రాక్టుల కోసమే ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని తిరిగే వారిని గెలిపిస్తే భూతద్దం పెట్టి ఎతికిన దొరకరని అన్నారు . ఈ నియోజవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత కారు నిండా నిధులు తెచ్చాను కానీ బారెడు నిధులకు మూరెడు సమయం సరిపోకపోవడంతో చేయాల్సిన అభివృద్ధి నీ చేసేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని సభకు వచ్చిన ప్రజలను ప్రాధేయపడ్డారు. మరొకసారి నన్ను ఆశీర్వదించి గెలిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేస్తానన్నారు. ఈ సభలో విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధనాచారి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ రాష్ట్ర కళ్ళు గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నర్సింహ రెడ్డి, జెల్లా మార్కండేయ, కర్నాటి శ్రీనివాసులు, రెగట్టే మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీటీసీలు కర్నాటి వెంకటేశం, వీరమల్ల భానుమతి, పాశం సురేందర్ రెడ్డి, ఎంపీపీలు పల్లె కల్యాణి, కర్నాటి స్వామి, మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ, నాయకులు  బండా పురుషోత్తం రెడ్డి, భవనం శ్రీనివాస్ రెడ్డి, దాడి శ్రీనివాస్ రెడ్డి, పొలగొని సైదులు గౌడ్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఐతగొని విజయ్, పగిల్ల సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love