15 రోజుల పర్యటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ నెల 16న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అమెరికాకు వెళ్లనున్నారు. ఆయన కూతురి ఉన్నత విద్య కోసం అమెరికాకు పంపించడానికి వెళ్తున్నారు. ఈనెల 30 వరకు అంటే 15 రోజులపాటు ఆయన అమెరికాలో పర్యటిస్తారు. ఈనెల31న తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. రోజుకు 18 గంటలు పని చేశానని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించింది ఏముందని ప్రశ్నించారు. సర్వే నెంబర్లు చూసి ఇబ్బంది పెట్టడం తప్ప చేసేదేముందని అన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో తమకు అన్నీ తెలుసనీ, సమయం వచ్చినపుడు అన్నీ బయట పెడతామని హెచ్చరించారు. గాజుల రామారం చౌరస్తా లేదా ఎక్కడికి వెళ్లి అడిగినా కేసీఆర్ ప్రభుత్వం బాగుందా… రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? అని అడిగితే ఎవరైనా చెబుతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం ఆదాయంలో వృద్ధి తప్ప అన్ని రంగాల్లో వెనక్కి వెళ్లిందన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టంగా చెప్పారని వివరించారు.
16న అమెరికాకు కేటీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



