
– చోద్యం చూస్తున్న అధికారులు
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని లక్ష్మీపూర్ టూ కరీంనగర్ జిల్లా కేంద్రానికి రేయింబవళ్లు ఎర్ర మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు రవాణదారులు. మండలంలోని మట్టిని రవాణదారులు యథేచ్చగా జిల్లాలు దాటిస్తుండడంతో అధికారుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. సంబధిత అధికారులు చోద్యం చూడడంతోనే మండలంలోని మట్టి గత కొద్ది రోజులుగా యథేచ్చగా తరలిపోతోందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు చోద్యం చూడకుండా చట్టపరమైన సత్వర చర్యలు చేపట్టాలని యువజన సంఘాల నాయకులు కోరుతున్నారు.