అర్థరాత్రి టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి..

– అక్రమ మట్టి రవాణ వాహనాల పట్టివేత 
నవతెలంగాణ – బెజ్జంకి 
మండలంలో అర్థరాత్రి అక్రమ దందాలపై టాస్క్ ఫోర్స్ అధికారులు అకస్మికంగా దాడి చేశారు.మంగళవారం మండల పరిధిలోని చీలాపూర్ గ్రామ శివారు నుండి మండల కేంద్రంలోని వెంచర్ కు అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి జసీబీ యంత్ర,టిప్పర్లను పట్టుకున్నారు. పట్టుబడిన వాహనాలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ కు చట్టపరమైన చర్యల నిమిత్తం తరలించారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత…
మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు నుండి అర్థరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషనుకు తరలించినట్టు బుధవారం ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు.
అక్రమ దందాలపై అధికారుల కంటి తడుపు ..
గత కొద్ది నెలలుగా మండలంలో అక్రమ ఇసుక,మట్టి దందా జోరుగా సాగుతున్న సంబంధిత అధికారులు కంటి తడుపు చర్యలకు పాల్పడుతున్నారనేది అక్షరాల నిజం.విధులు నిర్వర్తించే బ్లూకోల్డ్ పోలీసులు రాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణదారులకు వత్తాసు పలుకుతూ డయల్ 100కు పిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని గాగీల్లపూర్ గ్రామస్తులు వాపోతున్నారు.పోలీసులు అక్రమ ఇసుక వాహనాలను పట్టుకోని జరిమానాతో సరిచేస్తుండడంతో యథావిధిగా ఇసుక రవాణను అక్రమార్కులు సాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల అండతోనే విచ్చలవిడిగా మట్టి దందా సాగిస్తున్నామని ఏ అధికారులు మమ్మల్ని ఏమి చేయలేరనే దీమాను మట్టి రవాణదారులు పలువురి వద్ద వ్యక్తం చేయడం చర్చనీయాంశం.
Spread the love