నవతెలంగాణ – మంథని
హైదరాబాద్ లోని అంబేద్కర్ సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీ పథకాల్లో ఒకటైన రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని ప్రారంభించి మొదటి విడతగా లక్ష లోపు బకాయిలు ఉన్న దాదాపు 11.08 లక్షల మంది రైతులకు రూ.6,098 కోట్ల రూపాయలను మాఫీ చేసిన శుభ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో చైర్మన్, రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును శుక్రవారం జాతీయ వికలాంగుల నెట్వర్క్ అధ్యక్షులు నల్లగొండ శ్రీనివాస్ తో పాటు మంథని ప్రముఖ న్యాయవాది ఇనుముల సతీష్ కలిసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.