ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజలకు చేసింది శూన్యం

– ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ధనస్వామ్యంగా మారుస్తున్నారు..
– బీజేపీ పార్టీకి రాజీనామా చేశా
– పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడిద తిరుపతి..
నవతెలంగాణ – మంథని
పెద్దపల్లి పార్లమెంటు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజలకు చేసింది శూన్యమని, ప్రజాస్వామ్యాన్ని బ్రష్టు పట్టించి కూని చేస్తున్నారని ధన సౌమ్యంగా మారుస్తున్నారని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడిద తిరుపతి ఆరోపించారు. శుక్రవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు చెందిన నాయకులు డబ్బు సంచులు నోట్ల కట్టలు మందు సీసాలతో ప్రజల ముందుకు వస్తున్నారని, ఆయన ప్రజా సేవ చేయాలనే అనుకునే ప్రజాస్వామిక వాదులు జైలు ఉంటున్నారని డబ్బు సంచులతో వచ్చే నాయకులు రాజ్యాధికారం చేపడుతున్నారు. ఈ విధానం మారాలంటే ఎన్నికల్లో అలాంటి వ్యక్తులకు తమ అమూల్యమైన ఓటు ద్వారా బుద్ధి చెప్పడమే ఏకైక పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేసే గడ్డం వారి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎస్సీ ఎస్టీ మైనార్టీ దళితులు ఎదగడం మీకు ఇష్టం లేదా అని ఆయన ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుటకు సిద్ధంగా ఉన్నానని, ఈ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా ఆశీర్వదించాలని ఆయన ప్రజలను ప్రజాస్వాగవాదులను యువకులను రైతులను కార్మికులను హర్షకులను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఇరుగురాల ప్రసాద్,భీమనపల్లి సురేందర్,గుడ్ల గురువేష్,మహమ్మద్ సర్వర్,మంథని సాగర్ లు పాల్గొన్నారు.

Spread the love