Sunday, May 24, 2026
E-PAPER
HomeNewsన్యాయవాది మొయినుద్దీన్‌ హత్య కేసు.. నిందితుల ఫోటోలు విడుదల

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్య కేసు.. నిందితుల ఫోటోలు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనకు సంబంధించి నిందితుల ఫోటోలను విడుదల చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా స్కార్పియో కారులో నలుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజులుగా రెక్కీ నిర్వహించిన తర్వాతే దాడికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. వక్ఫ్ బోర్డు భూముల వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -