- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వేసవి సెలవులు మే 31తో ముగియనున్నాయి. జూన్ 1 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు అకడమిక్ క్యాలెండర్లను విడుదల చేశాయి. ఏపీలో 2026-27 విద్యాసంవత్సరానికి 232 పని దినాలు, తెలంగాణలో 224 పని దినాలు ఉండనున్నాయి. మరోవైపు స్కూల్ విద్యార్థులకు మాత్రం జూన్ 11 వరకు సెలవులు కొనసాగుతాయి. జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.
- Advertisement -



