డిప్యూటీ సీఎం బట్టిని కలిసిన నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు

– నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ కు ఛైర్మన్ ను నియమించాలి..
– దేవాలయ కళ్యాణ కట్టల్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క ను  తెలంగాణ రాష్ట్ర నాయీబ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘం (కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ) అధ్యక్షులు వెంకన్న, ఉపాధ్యక్షులు కొలిపాక సతీష్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలిసి వినతి పత్రం అందించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాయీబ్రాహ్మణులకు ఫెడరేషన్ ను కార్పొరేషన్  గా ఏర్పాటు చేయాలని కోరమన్నారు. ఛైర్మన్ ను, పాలక మండలి ఏర్పాటు చేయాలని చెప్పమన్నారు. నాయి బ్రాహ్మణులకు ఎంఎల్సీ తో పాటు రాష్ట ప్రభుత్వ కార్పొరేషన్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరమన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కల్యాణ కట్టల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులు, మహిళలను  నాలుగో తరగతి ఉద్యోగులుగా రెగ్యులర్ చేయాలని  కోరమన్నారు. వేములవాడ, గద్వాల, కొండగట్టు, బాసర, ధర్మపురి, కాలేశ్వరం, బాసర, మేడారం సమ్మక్క సారలమ్మ, కొత్తగట్టు తదితర దేవాలయాల్లో ఉన్న కళ్యాణ కట్టల్లో నాయి బ్రాహ్మణ పోస్టులను భర్తీ చేయాలని కోరమన్నారు. ఆయా దేవాలయాల్లో ధర్మకర్తల మండలి లో సభ్యులుగా నాయి బ్రాహ్మణులు కూడా అవకాశం కల్పించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ.సర్పంచ్ పదవుల్లో పోటీ చేసేందుకు నాయీబ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. జిల్లాలలో మార్కెట్ చైర్మన్ పదవులతో పాటు రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు రాష్ట స్థాయి డైరెక్టర్ లు గా అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో సలహాదారు శ్రీహరి వేములవాడ వెంకటస్వామి వేణు గోపాల్ విజేందర్ శ్యామ్, కిరణ్, మల్లికార్జున్, రాఘవ, వాసు, నగేష్, రవి, కిరణ్, వెంకట్రావ్, శ్రీనివాసరావు, సందీప్ పరమేష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love