నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

– ఏవో శ్రీనివాస్, ఎస్సై లక్ష్మారెడ్డి

నవతెలంగాణ శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని ఫెర్టిలైజర్ లో నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టుట కోసం వ్యవసాయ అధికారి రాచకొండ శ్రీనివాస్, స్థానిక ఎస్సై లక్ష్మారెడ్డి,లు కలిసి మండలం లోని ఫెర్టిలైజర్ దుకాణాలను శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఫెర్టిలైజర్ డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మినచో చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.అనంతరం కన్నాపూర్ గ్రామం లో ఏఈవో సునంద,తాడికల్ గ్రామంలో ఏఈవో లక్ష్మీ ప్రసూన,లు రైతులకు అవగాహన కల్పిస్తూ నకిలీ విత్తనాలను కొనుగోలు చేయరాదని ఎమ్మార్పీ ధరకే కొనుగోలు చేయాలని, అలాగే( కుల్ల ) విడిగా విత్తనాలు కొనుగోలు చేయవద్దని ఒకవేళ కొనుగోలు చేశాక బిల్ కచ్చితంగా తీసుకోవాలని రైతులకు సూచించారు.

Spread the love