ప్రజా సమస్యలపై పోరాడే జహంగీర్ ను గెలిపించండి : సీపీఐ(ఎం)

– సీసీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్
నవతెలంగాణ – మునుగోడు
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడేజహంగీర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్ ను ప్రజలు ఆదరించిఅత్యధిక మెజార్టీతో, ప్రశ్నించే గొంతును, పార్లమెంటుకు పంపాలని ఆయన ప్రజలను కోరారు. విద్యార్థి దశ నుండి 35 సంవత్సరాలుగా ప్రజల మధ్యన ఉంటూ, ప్రజల పక్షాననిస్వార్ధంగా నిలిచి, అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టి, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేసి, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండి పోరాడే వారని అన్నారు. సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ఎస్ ఎల్ బీసీ, ఉదయ సముద్రం, బస్వపురం, గంధ మల్ల దేవాదుల, ప్రాజెక్టులు పూర్తి చేయాలని, విద్య, వైద్యం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై, పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఆయనకు, సీపీఐ(ఎం) కు ఉందన్నారు. ఈ నియోజకవర్గంలో, భిన్న పార్టీల అభ్యర్థులు  పోటీ చేస్తున్నప్పటికీ, వారు స్వార్థ ప్రయోజనాల తప్ప, ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర లేదని, డబ్బులతో  ప్రజలను తప్పుతోవ పట్టించి ఎన్నికల్లో గెలవాలనే, ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు వాస్తవాన్ని గ్రహించి, ఐదేండ్లుమన భవిష్యత్తును నిర్ణయించే  ఓటును, ప్రజల మధ్యన ఉంటూ  ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు, మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, ఎండి సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love