చల్ల చల్లగా.. భలే రుచిగా !

నవతెలంగాణ – బొమ్మలరామారం
జిల్లా కేంద్రంలో తాటి ముంజలు అమ్మకాలు జోరందుకున్నాయి. వేసవిలో ఎండలు ముదురుతుండగానే..శరీరానికి చలువ చేసే ముంజలు వచ్చేశాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కొందరు గౌడ్ కులస్తులు నేరుగా ముంజలను తీసుకొస్తుండగా. ఇంకొన్ని చోట్ల ఇతరులు సైతం గౌడ్ ల నుంచి కొనుగోలు చేసి జిల్లా కేంద్రంలో పలుచోట్ల రోడ్లపై డజన్ రూ.100 చొప్పున వీటిని విక్రయిస్తుండంగా.. ఎండాకాలంలో మాత్రమే లభించే ముంజల కొనుగోలుకు జనం ఆసక్తి కనబరుస్తున్నారు.

Spread the love