అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేను గెలిపించుకుందాం

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి కృషిచేసిన ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని ఉమ్మాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. సతీష్ కుమార్ నాలుగో నెంబర్ కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ గ్రామాల అభివృద్ధి పనులను, బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను పంపిణీ చేస్తూ ప్రచారం చేపట్టారు. పేద ప్రజలకు అండగా నిలిచే సతీష్ అన్నను గెలిపించాలని కోరారు.
Spread the love