Sunday, June 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

- Advertisement -

• తొర్రూరు వైద్యాధికారి డాక్టర్ జ్వలిత 
నవతెలంగాణ -పెద్దవంగర 
పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తొర్రూరు వైద్యాధికారి డాక్టర్ జ్వలిత అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆమె పాల్గొని, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాదకర వ్యాధికి శాశ్వత అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఐదేళ్ల లోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు.

“నిండు జీవితానికి రెండు చుక్కలు” అనే సందేశాన్ని ప్రతి కుటుంబం ఆచరణలో పెట్టి, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బూత్‌ కు రాలేని చిన్నారులకు 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ నందనా దేవి, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -