– సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి, జాజిరి
– గంగారంలో మద్దిశెట్టి పోశయ్య సంస్మరణ సభ
నవతెలంగాణ-సత్తుపల్లి
సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు మద్దిశెట్టి పోశయ్య ఆశయాలను కొనసాగించాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్ అన్నారు. సోమవారం గంగారం గ్రామంలో ఆ పార్టీ నాయకుడు కావూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన పోశయ్య సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. పోశయ్య చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాండురంగారావు శ్రీనివాస్ మాట్లాడారు. గంగారం గ్రామంలో పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి పోశయ్య ఎంతో కృషి చేశారని వారన్నారు. పేదలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాటాలు చేశారని గుర్తుచేసుకున్నారు.
ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకుడిగా పోశయ్య అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల పట్ల ఆయన చూపిన నిబద్ధత కార్యకర్తలకు ఎల్లప్పుడూ మార్గదర్శకమని తెలిపారు. ఆయన మరణం సీపీఐ(ఎం)కు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోశయ్య ఆశయాలను కొనసాగిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరింత ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్, మండల నాయకులు రావుల రాజబాబు, అయినంపూడి సనందరావు, కువ్వారపు లక్ష్మణరావు, దేవళ్ల రామారావు పాల్గొన్నారు. నాయకులు జయరాజు, కొలికిపోగు రత్తయ్య, వెంకటరమణ, రఘు, రాఘవలతో పాటు పోశయ్య కుటుంబ సభ్యులు ఈ సంస్మరణ సభలో పాల్గొన్నారు.



