అయ్యప్ప స్వాముల ఇబ్బందులపై ఐక్యంగా పోరాడుదాం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
అయ్యప్ప స్వాములకు కేరళలోని ట్రావెన్కోర్ దేవస్థానం వద్ద ఇబ్బందుల దృష్ట్య తెలంగాణ అధికార యంత్రాంగాన్ని శబరిమలలో ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలంగాణ ఐఖ్య వేధిక నాయకులు నాయిని బుచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని వడాయిగూడెం వైఎస్ఎన్ఎస్ వాసవి నిత్యాన్నదాన సత్రం సురేంద్రపురినందు తెలంగాణ అయ్యప్ప ఐఖ్య వేధిక ముఖ్య గురుస్వాముల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో అయ్యప్ప మాల వేసుకుని ఏటా లక్షలాది మంది శబరిమలకు వెళ్తున్నా అక్కడ కనీస వసతులు మంచినీరు, ఆహారం. వైద్య సహాయం అందక ఎన్నోమంచినీరు, ఆహారం, వైద్య సహాయం అందక ఎన్నో అవస్తలు పడుతున్నారని, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కేరళ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జేఏసి కోరారు. ఈ కార్యక్రమంలో రాధకృష్ణ గురుస్వామి. ప్రేమ్ గాంధీ గురుస్వామి. వైఎల్ఎన్ఎస్ వాసవి సత్రం అధ్యక్షులు ఐత రాములు, గురుస్వాములు మీద విజయ్ కుమార్, పెండెం శ్రీనివాస్, చీకటిమల్ల రాములు దాసోజు విశ్వరూపం, రాంపల్లి చంద్రం, ఎన్వీడి నాగేశ్వర్ రావు, ఏదులబాదు కృష్ణ, ప్రకాష్, శివ శంకర్, కళ్లెం వెంకటేష్, రమణ, రచ్చ ప్రభాకర్, సురేష్ రెడ్డి, ఆనంద్ లు పాల్గొన్నారు.
Spread the love