Saturday, June 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకలిసికట్టుగా ఏఐపునాదులను పటిష్టం చేద్దాం!

కలిసికట్టుగా ఏఐపునాదులను పటిష్టం చేద్దాం!

- Advertisement -

భారత్-అమెరికా రౌండ్‌టేబుల్ సమావేశంలో నిర్ణయం
ఇండియా, యూఎస్ రహస్య

వాషింగ్టన్ : భారత్, అమెరికా సంబంధాల్లో కీలక పరిణామం జరిగింది. ఇరుదేశాల వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నంలో భాగంగా భారత్, అమెరికాలు ఒక రహస్య రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ మీటింగ్‌లో ఇరు దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు పాల్గొని ఏఐ, సెమీకండక్టర్ సరఫరా గొలుసులు, కీలక ఖనిజాల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిం చారు. ఈ సమావేశంలో కలిసికట్టుగా ఏఐ పునాదులను పటిష్టం చేద్దామని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ మీటింగ్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ అమెరికాలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ఎక్స్‌‌లో పోస్ట్ పెట్టింది. “చిప్స్, కీలక ఖనిజాలు, ఏఐ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ, అమెరికన్ కంపెనీల బృందాన్ని ఉద్దేశించి అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా, ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్, వాణిజ్య శాఖ డిప్యూటీ అండర్ సెక్రెటరీ బిల్ గైడెరా ప్రసంగించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని యూఎస్‌లోని ఇండియన్ ఎంబసీ యూఎస్‌ఐఎస్‌పీఎఫ్, సిల్వరాడో పాలసీ యాక్సిలరేటర్‌ (పరిశోధనా సంస్థ)తో కలిసి నిర్వహించింది. ఈ మీటింగ్‌లో జరిగిన చర్చల్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నాగరాజ్ నాయుడు, యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ అధ్యక్షుడు ముకేశ్ అఘి, ఇంధన శాఖ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ క్రిస్టోఫర్ సల్దానా కూడా పాల్గొన్నారు. పెట్టుబడి వాతావరణాన్ని బలోపేతం చేయడం, ఏఐ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడంపై ఈ రౌండ్ టేబుల్ సమావేశం దృష్టి సారించింది” అని అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ఎక్స్ పోస్టులో పేర్కొంది.

వాల్‌మార్ట్ సీఈఓతో వినయ్ క్వాత్రా భేటీ
కొద్దిరోజుల క్రితం అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా పెట్టుబడి విస్తరణ, సరఫరా గొలుసు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల గురించి చర్చించడానికి అగ్రశ్రేణి కార్పొ రేట్, టెక్నాలజీ నాయకులతో పలు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిం చారు. అమెరికాతో ఢిల్లీకి పెరుగుతున్న ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత మార్కెట్లో తమ ఉనికిని మరింత విస్తరించుకోవడంపై చర్చించడానికి రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రెసిడెంట్, సీఈఓ క్రిస్ నికోలస్‌తో సమావేశమయ్యారు. “దేశంలో వాల్‌మార్ట్ పెట్టుబడులు, దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికలు, పటిష్టమైన సరఫరా గొలుసులను నిర్మించాలనే నిబద్ధతపై ఆ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ క్రిస్ నికోలస్‌తో ఫలప్రదమైన చర్చలు జరిపా” అని వినయ్ క్వాత్రా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -