నవతెలంగాణ – జుక్కల్
గ్రామస్తుల సహకారంతో పెద్దగుల్లా గిరిజన తాండాలను అభివృద్ధి బాటలో తీసుకువెళ్లామని గ్రామ సర్పంచ్ సుమతి రాథోడ్ యశ్పాల్ అన్నారు. శనివారం గిరిజన గూడెంలో మీ గ్రామపంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ప్రత్యేక గ్రామసభ సమావేశం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి నాగయ్య తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో మేలుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు గ్రామస్తులతో చర్చించి నిర్మాణాలు చేయడం జరిగింది అని అన్నారు. మొదటగా గ్రామంలో నీటి సమస్యను లేకుండా, శానిటేషన్ పనులు, వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జెర్రీలు తీసుకోవడం, పిచ్చి మొక్కలను తొలగించడం, మురికి కాలువలలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం, మొక్కలు నాటడం అవి అంశాల పైన గ్రామస్తులతో చేర్పించడం జరిగింది. తాండ వాసుల వారి కోరిక మేరకు నిర్మాణాలు చేశామని కార్యదర్శి నాగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్తోపాటు ఉప సర్పంచ్, జీపీ కార్యవర్గ సభ్యులు , మాజీ సర్పంచ్ , గ్రామ మహిళా సంఘాల సభ్యులు , యువకులు, గ్రామ పెద్దలు, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ , తదితరులు పాల్గొన్నారు.
పెద్దగుల్లా తాండను అభివృద్ధి చేసుకుందాం: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



