సింగరేణిలో రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడదాం

నవతెలంగాణ-మణుగూరు
సింగరేణిలో రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడుదామని, దేశానికి ఆదర్శప్రాయంగా నిలుద్దాం రక్షణ తనిఖీ బృందం కన్వీనర్‌ ఎన్‌.వెంకటేశ్వర రావు (జిఎం ఎడ్యుకేషన్‌) అన్నారు. శనివారం సింగరేణి 54వ రక్షణ పక్షోత్సవాలు (ఈనెల 26వ తేదీ నుండి నవంబర్‌ 9వ తేదీ వరకు) సింగరేణి వ్యాప్తంగా నిర్వహించు కార్యక్రమంలో రక్షణ తనిఖీ బృందం మణుగూరు ఏరియా, ఓసీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం 53వ వార్షిక రక్షణ పక్షోత్సవాలలో థస్ట్‌ ఏరియా 1లో మణుగూరు ఓసీకి వచ్చిన మొదటి బహుమతి, సర్టిఫికెట్‌ను మణుగూరు ఓసీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, మేనేజర్‌, అతిధుల చేతుల మీదగా అందచేశారు. అనంతరం మణుగూరు ఓసీలో ఆక్సిడెంట్‌ ఫ్రీ ఉద్యోగిగా పువ్వడా రాజేశ్వర్‌ రావుకి బహుమతి అందచేశారు. మరియు రక్షణ చర్యలు పాటించటంలో ముందు వుండే కిషన్‌ రాం(ఎన్విరాన్మెంట్‌ ఆఫీసర్‌), కె.ఉపేందర్‌ (సూపర్‌ వైసర్‌), స్వరూప (మహిళా మాజ్దూర్‌)కు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ తనిఖీ బృందం సభ్యులు ఎన్‌.వెంకటేశ్వర రావు, జిఎం (ఎడ్యుకేషన్‌)( కన్వీనర్‌), రాజమల్లు, డిజిఎమ్‌ (ఎస్‌టీపీపీి), బి.శంకర్‌ రావు (డీజీఎం (ఈ అండ్‌ ఎం) బాలాజీ నాయుడు, డీజీఎం(సర్వే), టి.పోషమల్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Spread the love