అభివృద్ధి పనులతో సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుదాం

– జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి
నవతెలంగాణ-షాబాద్‌
అభివృద్ధి పనులు చేపట్టి మండలంలోని అన్ని గ్రామాలను సమస్యలు లేని విధంగా తీర్చిదిద్దుదామని జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నిధుల నుంచి మండలానికి మంజూరైన రూ.2 కోట్ల నిధులకు సంబంధించిన ప్రొసిడింగ్‌ను సర్పం చులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా షాబాద్‌ మండ లానికి కోట్లాది నిధులు మంజూరైనట్టు చెప్పారు. ఆ ఫలి తంగా అంతర్గత మురుగు కాలువలు, సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయాలు, చెరువుల మరమత్తులు తదితర పనులు చేపట్టినట్టు వెల్లడించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఎమ్మెల్యే కాలె యాదయ్య పర్యటన ద్వారా శుభోదయం కార్యక్రమంలో ప్రజలను అడిగి తెలుసుకుని నిధులను అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ నక్క శ్రీనివాస్‌గౌడ్‌, పీఎసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ మద్దూర్‌ మల్లేష్‌, సర్పంచులు కుమ్మరి దర్శన్‌, ఏశాల చంద్రశేఖర్‌, పగడాల నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్‌ దేవేందర్‌రెడ్డి, నాయకులు మల్లికార్జున్‌గౌడ్‌, రాంచంద్రారెడ్డి, శేఖర్‌రెడ్డి, నర్సింహులు, మునీర్‌, గోపాల్‌, యాదిరెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love