Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

- Advertisement -

జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార కళార్చన 
నవతెలంగాణ-వనపర్తి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, నిస్వార్ధ ఆర్గనైజేషన్, మై భారత్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ప్రభుత్వ బాలికల పాఠశాలలో పర్యావరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార కళార్చన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని భవిష్యత్తులో ప్లాస్టిక్ భూతం మానవాళికి ఎంతో హాని కలిగిస్తుందని తెలియజేశారు. కావున అందరూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ భాగంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన చిత్రాలేఖనం పోటిల్లో గెలుపొందిన విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, కలర్ పెన్స్ బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాదేవి, బాలభవన్ ఉపాధ్యాయులు లావణ్య, నిమిషా, నిస్వార్ధ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు ప్యార్సాని అరవింద్, ఆంజనేయులు, బాలకృష్ణ, సంతోష్ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -