కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడుదాం: సీపీఐ(ఎం)

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా..పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్
నవతెలంగాణ జనగామ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక  విధానాలను తిప్పికొడుదాం అని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నివసిస్తూ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి 7 వరకు సీపీఐ(ఎం) నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా గురువారం స్థానిక నెహ్రూ పార్క్ వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ వరకు సిద్దిపేట జనగామ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సీపీఐ(ఎం) నాయకులకు పోలీసులకు తీవ్రవాగ్నివాదం తోపులాట చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాసా అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జోగు ప్రకాష్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర సరుకుల ధరలు  వెంటనే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మొదలు పెట్టాలన్నారు. మహిళలపై రోజురోజుకు దాడులు, లైంగికదాడులు పెరిగిపోయి వారి బతుకులు చిధ్రం అయ్యాయని అన్నారు. దేశంలో కులమత ఘర్షణలు పెరిగిపోతున్నాయి అన్నారు. వీటికి కారణమైన బీజేపీ హిందుత్వం పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలో కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు  అన్నారు. వీరిపై పన్నుల భారం పెంచి మరింత దరిద్యంలోకి నేడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.  నిత్యవసర సరుకులు పెరగడానికి ప్రభుత్వాలే కారణం అన్నారు. నిత్యవసర సరుకులపై 12- 18 శాతం పన్నులు వేయడంతో అనివర్యంగా ధరలు పెరుగుతున్నాయి  అన్నారు. నిత్యవసర సరుకులు ధరలను అరికట్టాలని డిమాండ్ చేశారు. మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపరిచి, బ్లాక్ మార్కెట్ ను  అరికట్టాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పందిళ్ళ కళ్యాణి, కళ్యాణం లింగం, బెల్లంకొండ వెంకటేష్, ఎండి అజారుద్దీన్, బొట్ల శ్రావణ్, బి. వెంకట మల్లయ్య, భాష పాక విష్ణు, సందీప్, కచ్చి గళ్ళ వెంకటేష్, భూనాద్రి వెంకటేష్, చిలువేరు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love