‘కాలుష్యం నుంచి భూమండలాన్ని కాపాడుకుందాం’

– సినీ గేయ రచయిత డాక్టర్‌ వెనిగళ్ళ రాంబాబు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్‌
కాలుష్యం నుంచి భూమండలాన్ని కాపాడుకుం దామని సినీ గేయ రచయిత డాక్టర్‌ వెనిగళ్ళ రాంబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా బుధవారం ఉదయం కష్ణకాంత్‌ పార్క్‌ మెయిన్‌ గేటు వద్ద జన విజ్ఞాన వేదిక హైదరాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చే సిన ఆయన మాట్లాడుతూ మన భారతీయ వారసత్వంలోనే పర్యావరణ పరిరక్షణ దాగి ఉందని, సకల జాతులను పరిరక్షిస్తూ ప్రకతికి హాని చేయ కుండా మన పూర్వికులు సహజ సంపదలను భావి తరాలకు అందజేశారని తెలిపారు. వాటిని కాపాడవ లసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆధునిక మాన వుడు పెట్టుబడి పేరు తోటి లాభాపేక్షతో పకతికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తూ మానవజాతి మునుగడకే ప్రమాదాన్ని కొనితెస్తున్నారని తెలియ జేశారు. ఇప్పటికే అనేక జీవజాతులు అంతరించా యని, ఆధిక ఉష్ణోగ్రతకు కారణమైన పర్యావరణ కాలుష్యాన్ని నివారించలేని పక్షంలో , భూతాపంతో భూమండలంతో పాటు మానవాళి మనుగడకే మొ ప్పు ఏర్పడవచ్చు అని, విచక్షణారహితంగా ఆడవుల నరకివేత, అక్రమ గనుల త్రవ్వకాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మితిమీరిన ప్రయివేటు వాహనాలు, ప్లాస్టిక్‌ పదార్థాలు వాడకాల ఫలితంగా భూమి, గాలి, నీరు పర్యావరణ కలుషితం అవుతుందన్నారు. భావి తరాలకు ఈ భూమండలాన్ని భద్రంగా బహుమతిగా అందించాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. హైదరాబాద్‌ ఫార్మా ఇండిస్టీ వ్యవస్థాపకులు వి.రామకష్ణారావు మాట్లాడుతూ గ్రీన్‌ హౌస్‌ గ్యాసెస్‌(కర్బన్‌)విష వాయువులతో పర్యావరణ కాలుష్యం, అధిక ఉష్ణోగ్రత కారణంగా ఏర్పడే భూతాపంతో(గ్లోబల్‌ వార్మింగ్‌) దవాల వద్ద మంచు పర్వతాలు కరిగి, సముద్ర మట్టాలు పెరిగి కొన్ని దీవులు మునిగిపోయే ప్రమాదం ఉందని తెలియజే శారు. ఓజోన్‌ పొర క్షీణించి చర్మ వ్యాధులు, క్యాన్సర్‌ పెరుగుతున్నాయని తెలిపారు. కాలుష్యంతో అతివష్టి, అనావష్టి ఫలితంగా ఉపద్రవాలు సంభవిస్తున్నాయ ని, అంటువ్యాధులు విష జ్వరాలు ప్రబలుతున్నాయి అని పేర్కొన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవా ధ్యక్షులు చంద్రశేఖర రావు మాట్లాడుతజూ విద్యార్థి యువత ఉద్యోగ ఉపాధ్యాయ, మధ్య తరగతి మేధావులంతా పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వామ్య కావాలి అని కోరారు. కష్ణ కాంత్‌ పార్క్‌ వాకర్‌ అసోసియేషన్‌ సభ్యులు, అడ్వకేట్‌ రాజేష్‌ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ బ్యాగులు వాడకాన్ని తగ్గించి, దానికి బదులుగా గుడ్డ సంచులు, జ్యూట్‌ సంచులని వాడి భూమి, నీటి వనరులు కాలు ష్యం కాకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రవీంద్రబాబు, జిల్లా కమిటీ సభ్యులు కె.సూర్య నారాయణ, సాయి, జన విజ్ఞాన వేదిక జూబ్లీహిల్స్‌ జోన్‌ కమిటీ సభ్యులు పోసాని సుబ్బారావు , పి .పాపారావు, సిహెచ్‌.మురళి, బి.సంతోష్‌ కుమార్‌, ఎస్‌.జితిన్‌ ప్రసాద్‌, ఆర్‌.అశోక్‌, ఎం.బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Spread the love