సరైన ఉష్ణోగ్రతలో ఏసీని సెట్ చేయండి
చాలామంది గది త్వరగా చల్లబడాలని ఏసీని 18 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువకు సెట్ చేస్తుంటారు. కానీ ఇది విద్యుత్ వినియోగాన్ని భారీగా పెంచుతుంది. నిపుణుల సూచనల ప్రకారం ఏసీని 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంచడం ఉత్తమం. ఇలా చేస్తే కరెంట్ ఆదా అవుతుంది, ఏసీపై భారం కూడా తగ్గుతుంది.రెగ్యులర్ సర్వీసింగ్ చేయించండి ఏసీ పనితీరు బాగుండాలంటే క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలి. కనీసం ప్రతి రెండు నెలలకు ఒకసారి మెకానిక్‌తో సర్వీసింగ్ చేయించుకోవడం మంచిది. ధూళి, మురికి పేరుకుపోతే ఏసీ ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది.
తరచూ తనిఖీ చేయండి
ఏసీ వైరింగ్ సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం. ఎక్కడైనా వైర్లు దెబ్బతిన్నా, టేప్‌తో కలిపి ఉన్నా వెంటనే మార్చించాలి. దెబ్బతిన్న వైరింగ్ వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏసీ పనితీరుపైనా ప్రభావం పడుతుంది. ఎయిర్ ఫిల్టర్‌ను శుభ్రంగా ఉంచండి ఏసీలోని ఎయిర్ ఫిల్టర్ గాలి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఫిల్టర్ మురికిగా ఉంటే గది చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వారానికి కనీసం ఒకసారి ఫిల్టర్‌ను శుభ్రం చేయాలి.
సీలింగ్ ఫ్యాన్‌ను కూడా ఉపయోగించండి
ఏసీ గాలి గది అంతటా త్వరగా వ్యాపించడానికి సీలింగ్ ఫ్యాన్ సహాయపడుతుంది. ఫ్యాన్‌ను తక్కువ వేగంతో ఆన్‌లో ఉంచితే గది వేగంగా చల్లబడుతుంది.
ఇలా వాడుదాం…
- Advertisement -
- Advertisement -



