కారు గుర్తుకు ఓటేసి సతీష్ అన్నను గెలిపిద్దాం

– ఇంటింటి ప్రచారంలో మున్సిపల్ పాలకవర్గం
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ : కారు గుర్తుకు ఓటేసి వొడితల సతీష్ కుమార్ ను గెలిపించుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ పాలకవర్గం ఇంటింటి ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఇంటింటికి పంపిణీ చేస్తూ వొడితల సతీష్ కుమార్ ను గెలిపించాలని కోరారు. గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న నాయకుడుని ప్రజలందరూ ఆశీర్వదించాలన్నారు.  ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్,  ఐలేని అనిత, కౌన్సిలర్లు  వాల సుప్రజ నవీన్ రావు, పెరుక భాగ్యరెడ్డి, హరీష్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, యండి అయూబ్, ఐలేని శంకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండి అన్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్  చిట్టి గోపాల్ రెడ్డి, మాజీ ఛైర్మన్ సుద్దాల చంద్రయ్య,  బండి పుష్ప, డాక్టర్ కొంకటి రవి, లక్ష్మణ్ నాయక్, భాష వేణి రాజయ్య, గంధె చిరంజీవి మణిహాస్ శ్రీనివాస్ స్వరూప, దొంతరబోయిన శ్రీనివాస్, రాజేష్, సుధా, భారతి  పాల్గొన్నారు.
Spread the love