అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే సతీష్ ను గెలిపించుకుందాం

– సర్పంచ్ వంగ విజయలక్ష్మి 
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి హుస్నాబాద్ ను ప్రగతి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  సర్పంచ్ విజయలక్ష్మి అన్నారు. ఆదివారం హుస్నాబాద్  మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేపట్టారు. మచ్చలేని నాయకుడిగా పేరుపొందిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు వివరించారు.
Spread the love