భారతీయ ఆయిల్ పామ్ రైతుల కోసం మొట్టమొదటిసారిగా వినూత్న మైన ఋణ సౌకర్యం అందిస్తున్న గోద్రెజ్ అగ్రోవెట్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి 5 సంవత్సరాల కాలంలో రైతులు వారి ఆయిల్ పామ్ గార్డెన్‌ను అభివృద్ధి చేయడం మరియు నిర్వహించే అవకాశం అందిస్తుంది.
నవతెలంగాణ – హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భాగస్వామ్యంతో ఆయిల్ పామ్ రైతుల కోసం మొట్టమొదటిసారిగా వినూత్నమైన ఫైనాన్స్ ఆఫర్‌ను ప్రారంభించినట్లు గోద్రెజ్ అగ్రోవెట్ యొక్క ఆయిల్ పామ్ బిజినెస్ ఈరోజు ప్రకటించింది. కంపెనీ మరియు దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ఋణ ఉత్పత్తి, రైతులకు మైక్రో ఇరిగేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి, పశువుల మేత మేయకుండా రక్షించడానికి ఫెన్సింగ్ ఏర్పాటుకు మరియు వారి ఆయిల్ పామ్ తోటల వద్ద గొట్టపు బావిని ఏర్పరచటానికి రుణాన్ని పొందేలా తోడ్పాటు అందిస్తుంది . ఫ్రెష్ ఫ్రూట్ బంచ్‌ల (FFB) ఉత్పాదకతను మెరుగుపరచడం ద్వారా ఆయిల్ పామ్ పెరుగుదలకు సహాయపడే లక్ష్యంతో పరిచయం చేసిన ఈ సదుపాయం తో పంట మొదటి 5 సంవత్సరాల కాలంలో తోటలను నిర్వహించడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
గోద్రెజ్ ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతా నియోగి మాట్లాడుతూ, “స్థిరమైన ఆయిల్ పామ్ ఫార్మింగ్‌లో రైతుల విశ్వాసాన్ని మెరుగుపరచడానికి మా కంపెనీ చేస్తున్న ప్రయత్నాలకు SBIతో భాగస్వామ్యం నిదర్శనం. సుదీర్ఘ పక్వ కాలంలో ఆదాయం లభించే అవకాశం లేక పోవటం చేత , ఈ భాగస్వామ్యం ప్రారంభ సంవత్సరాల్లో వారి ఆర్థిక అవసరాలకు అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది” అని అన్నారు.
“నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO-OP) అమలు ఆగస్టు 2021లో ప్రారంభించినప్పటి నుండి ఆయిల్ పామ్ పరిశ్రమలో కొత్త ఉత్సాహం రావటం తో పాటుగా ఈ పరిశ్రమ లో వృద్ధి ఊపందుకుంది. ప్రముఖ సంస్థ గా , మేము పరిశ్రమ విస్తరణ మరియు శ్రేయస్సు, కోసం పరిష్కారాన్ని అందించడం కొనసాగిస్తాము” అని ఆయన జోడించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతుల కోసం మొదట ప్రారంభించబడిన ఈ కార్యక్రమం తో తమిళనాడు, ఒడిశా, అస్సాం, మణిపూర్ మరియు త్రిపుర రాష్ట్రాలకు చెందిన గోద్రెజ్ ఆగ్రోవెట్ రైతులు ఇప్పుడు INR 1 Lac నుండి INR 50 కోట్ల టిక్కెట్ పరిమాణంతో సులభంగా రుణాన్ని పొందవచ్చు.
మొట్టమొదటి ఉద్యానవన ఋణం పై , K.V.L.N. మూర్తి, ఎ.జి.ఎం. ABU హైదరాబాద్, SBI మాట్లాడుతూ “ఆయిల్ పామ్ దిగుమతులను తగ్గించాలనే దేశం యొక్క అన్వేషణలో గోద్రెజ్ ఆగ్రోవెట్‌తో భాగస్వామ్యం చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఒక లక్ష 60 వేల రూపాయల వరకు రుణం కోసం ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేకుండా ఋణం అందిస్తాము. మొదటిసారిగా ఆయిల్ పామ్ వ్యవసాయ రంగం లో అడుగు పెట్టిన రైతులకు ఈ ఉత్పత్తి అనువైనది. గోద్రెజ్ అగ్రోవెట్ ద్వారా మొత్తం ప్రక్రియను సులభతరం చేయడంతో, ఒక రైతు ఉత్పత్తి సమగ్రతను సులభంగా అర్థం చేసుకోవచ్చు మరియు కంపెనీ యొక్క సమాధాన్ కేంద్రాలలో దాని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాబోయే నెలల్లో మన దేశంలోని మరింత మంది ఆయిల్ పామ్ రైతులకు ఈ ఉత్పత్తిని విస్తరింపజేయ గలమనే నమ్మకం తో మేము వున్నాము ” అని అన్నారు .
భారతదేశంలో అతిపెద్ద ఆయిల్ పామ్ ప్రాసెసర్ గోద్రెజ్ ఆగ్రోవెట్. రైతులతో వారి పంట మొత్తం జీవితచక్రం కోసం నేరుగా కలిసి పని చేస్తుంది. దేశవ్యాప్తంగా 65,000 హెక్టార్ల భూమి పామాయిల్ సాగులో ఉన్నందున, కంపెనీ 2027 నాటికి 1 లక్ష హెక్టార్ల సాగును పెంచాలని యోచిస్తోంది. దాని వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్, సమాధాన్ కేంద్రాల ద్వారా ఇది ఆయిల్ పామ్ రైతులకు విజ్ఞానం, సాధనాలు, సేవలు మరియు పరిష్కారాల యొక్క సమగ్ర ప్యాకేజీని అందిస్తుంది. . ప్రతి సమాధాన్ కేంద్రం 2,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ నాటడానికి మద్దతునిస్తుంది మరియు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు మరియు నిపుణుల సలహాలను ఉపయోగించడం ద్వారా రైతులు పరిపక్వ తోటలలో స్థిరమైన ఉత్పాదకతను సాధించడంలో సహాయం చేస్తుంది. SBIతో భాగస్వామ్యం ఆయిల్ పామ్ రైతుల ఆదాయాన్ని మరియు ఉత్పాదకతను పెంచే దిశగా వేసిన మరో ముందడుగు .